![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'బ్రహ్మముడి'(Brahmamudi). ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -989 లో..... ఐశ్వర్య తన ఫ్రెండ్ కి ఇవ్వాల్సిన అప్పు ఎలా తీర్చాలో ఆలోచిస్తుంటే.. పది లక్షలు విలువ గల నెక్లెస్ తన కోసం రేఖ చేయించింది గుర్తు చేసుకొని ఆ నెక్లెస్ అమ్మి అప్పు తీర్చాలని ఐశ్వర్య అనుకుంటుంది. రేఖ నెక్లెస్ పెట్టడం ఐశ్వర్య చూసి తన గదిలోకి వెళ్తుంది. ఐశ్వర్య వెళ్ళడం భ్రమరాంబ చూస్తుంది. ఐశ్వర్య గదిలోకి వెళ్లి నెక్లెస్ దొంగతనంగా తీసుకొని వెళ్లడం భ్రమరాంబ చూసి షాక్ అవుతుంది. సొంత మేనకోడలు చేతివాటం చూపించినప్పుడు..నా చేతివాటం చూపించకుండా ఎలా ఉంటానని భ్రమరాంబ అనుకుంటుంది. రేఖ గదిలోకి వెళ్లి మరో నెక్లెస్ దొంగతనం చెస్తుంది.
మరొకవైపు ఇందు ఇంటర్వ్యూకి వెళ్తుంది. అక్కడ హెచ్ఆర్ ఇందు కీ జాబ్ ఇవ్వాలని అనుకుంటాడు కానీ ఇందు డిగ్రీ పూర్తి చేసిన సర్టిఫికెట్ లేదని వద్దని అంటాడు. మొన్నే ఎగ్జామ్స్ రాసానని ఇందు చెప్పినా వినకుండా సర్టిఫికెట్స్ వచ్చాక రమ్మని చెప్తాడు. ఆ తర్వాత రాజు, లక్కీ ఇద్దరు ఐశ్వర్యని ఇంప్రెస్ చెయ్యడానికి వెళ్తుంటే.. తనే తన కార్ ప్రాబ్లమ్ వచ్చి రోడ్డుపై ఆగుతుంది. దాంతో లక్కీ లిఫ్ట్ ఇస్తానని అంటాడు. ఐశ్వర్య వాళ్ళు కార్ ఎక్కి వెళ్తుంటే ఇందు చూసి ఆటోలో వాళ్ళని ఫాలో అవుతుంది. ఇందు ఆటోలో వెళ్తుంటే అదే ఆటోకు ఎదురుగా నందు రౌడీ లని వెంబడిస్తూ కన్పిస్తుంది. నందుని రౌడీ లు కొట్టబోతుంటే ఇందు వచ్చి కాపాడుతుంది. ఎందుకు రౌడీలని వెంబడిస్తున్నావని ఇందు అడుగగా.. వీళ్ళు అమ్మవారి నగలు కొట్టేసారని నందు చెప్తుంది. వీళ్ళని స్టేషన్ లో అప్పగించే వరకు నాకు హెల్ప్ చెయ్యమని నందు అడుగగా.. ఇందు సరే అంటుంది. ఆ తర్వాత ఐశ్వర్య కార్ దిగి వెళ్ళిపోతుంది. తన బ్యాగ్ లో చూసుకోగా.. నెక్లెస్ కన్పించదు. అయ్యో వాళ్ళు పోయినట్లు ఉన్నారని ఐశ్వర్య టెన్షన్ పడుతుంది.మరొకవైపు రాజు లక్కీ ఒక దగ్గర కూల్ డ్రింక్ తాగుతుంటే కార్ లో ఉన్న నెక్లెస్ కన్పిస్తుంది. ఇది ఐశ్వర్యది ఉన్నట్టు ఉంది అనుకుంటారు. తరువాయి భాగంలో ఆ రోజు వ్యాన్ కాలిపోయినప్పుడు అందరి బాడీస్ ఉన్నాయి ఒక్క స్వరాజ్ ది తప్ప.. తను ఎక్కడో ఒక దగ్గర ఉన్నాడనిపిస్తుంది.. వెతుక్కుంటూ వస్తాడనిపిస్తుందని సుభాష్ తో అపర్ణ అంటుంది. ఆ తర్వాత ఐశ్వర్యకి నెక్లెస్ ఇవ్వడానికి రాజు, లక్కీ ఇద్దరు కలిసి ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వస్తారు. ఐశ్వర్య వాళ్ళ ఇంట్లో ఉన్న అపర్ణ, రేఖ ఇద్దరు రాజుని చూసి షాక్ అవుతారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |